ఆ విషయంలో తారక్ పై చెర్రీ దే పై చేయి..!

by సూర్య | Wed, Jul 06, 2022, 06:22 PM

రాజమౌళి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్" లో రామ్, భీం లుగా నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ను పొందారు టాలీవుడ్ టాప్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సమయంలోనే ఆచార్యలో కీలకపాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన చెర్రీ తదుపరి తన 15 వ సినిమాను శంకర్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన వెంటనే RC 15 షూటింగును స్టార్ట్ చేసి, ఇప్పటికి మూడు మేజర్ షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నవంబర్ కల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తిగా ముగుస్తుంది. ఆ వెంటనే అంటే డిసెంబర్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో RC 16 సినిమాను చెర్రీ చెయ్యనున్నారు. రాజమౌళి సినిమాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఆ తదుపరి సినిమా కోసం మరో సంవత్సరం ...అంటే మొత్తంగా రాజమౌళి డైరెక్షన్లో నటించే హీరో వెండితెరపై కనిపించాలంటే కనీసం నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. కానీ, చెర్రీ మాత్రం చాలా తెలివిగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుని, రాజమౌళి సెంటిమెంటును తిరగరాస్తున్నారు.
ఈ విషయంలో చెర్రీ కన్నా తారక్ చాలా వెనకబడి ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సమయంలో మరే సినిమాకు కమిటవ్వని తారక్, ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించాడు. ఆ రెండు సినిమాలలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తారక్ నటించనున్న చిత్రం ఇప్పుడప్పుడే పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు...ఎందుకంటే, ప్రశాంత్ "సలార్" ను పూర్తి చేయవలసి ఉంది. ఇక, కొరటాల డైరెక్షన్లో తారక్ నటించబోయే సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కానీ, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు మరో రెండు నెలల సమయం పట్టేటట్టు కనిపిస్తుంది. అప్పటికి చెర్రీ శంకర్ సినిమాను పూర్తి చేసి, గౌతమ్ సినిమాను స్టార్ట్ చేసే క్రమంలో ఉంటాడు. ఒక హీరోగా రామ్ చరణ్ తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్న తీరు మెగా అభిమానులతో పాటు మిగిలిన ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Latest News
 
రాత్రికి రావాలంటే నా రేటు ఇంత... ప్రియాంక సింగ్ కామెంట్ ప్రకంపనలు Wed, Apr 24, 2024, 02:06 PM
స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్ Wed, Apr 24, 2024, 02:03 PM
విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ టైం ఫిక్స్! Wed, Apr 24, 2024, 01:44 PM
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM