వైరల్: "వారసుడు" మరో "అజ్ఞాతవాసి" కాబోతుందా...?

by సూర్య | Wed, Jul 06, 2022, 03:07 PM

బెల్జియన్ కామిక్ బుక్స్ ఆధారంగా 2008 లో "లార్గో వించ్" అనే సినిమా విడుదలైంది. పుస్తకాలకు అంతగా ఆదరణ దక్కలేదు కానీ, లార్గో వించ్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
లార్గో వించ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఇప్పటికే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి", ప్రభాస్ "సాహో" సినిమాలు వచ్చాయి. విడుదలకు ముందు ఈ రెండు సినిమాలు కూడా లార్గో వించ్ కు కాపీ అని సోషల్ మీడియాలో ఒక రేంజులో వార్తలు హల్చల్ చేసాయి. తాజాగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం "వారసుడు"(తమిళ్ లో "వారిసు") కూడా లార్గో వించ్ కు ఎక్స్టెన్షన్ వెర్షన్ అని పుకార్లు వినబడుతున్నాయి. ఇందుకు సంబంధించి విజయ్ వారసుడు సినిమా లార్గో వించ్ కు ఇండియన్ వెర్షన్ అని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిపై లార్గో వించ్ ఫిలిం డైరెక్టర్ జెరోమ్ సాల్లే స్పందించడం విశేషం. ఏంటి ...!లార్గో వించ్ 3...నా? అని సోషల్ మీడియాలో వారసుడు మూవీ స్టోరీలపై వస్తున్న మీమ్స్ కు జెరోమ్ ట్వీట్ చేశారు.
నిజానికి ఆ మూవీ ఇన్స్పిరేషన్ తో వచ్చిన అజ్ఞాతవాసి, సాహో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ లయ్యాయి. మరి విజయ్ వారసుడు కూడా ఆ సినిమా ఇన్స్పిరేషన్ అనే అంటున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM