తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన శృతి హాసన్

by సూర్య | Tue, Jul 05, 2022, 11:13 PM

తన ఆరోగ్యం బాగాలేదంటూ వార్తలపై హీరోయిన్ శృతి హాసన్ మంగళవారం స్పందించింది. ఇటీవల శృతి హాసన్ పోస్ట్ చేసారు. తన హార్మోన్ల సమస్యల గురించి మాట్లాడుతూ,తాను మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. హార్మోన్ బ్యాలెన్స్  తప్పడంతో పీసీఓఎస్‌తో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు.అయితే కొన్ని మీడియా ఛాన‌ళ్లు మాత్రం ఈ వార్త‌ని వేరే విధంగా టెలికాస్ట్ చేశాయి.శృతి హాసన్ ఆరోగ్యం బాగోలేదని, ఆమె ఆసుపత్రిలో చేరిందని మీడియాలో వార్తలు వచ్చాయి.తాజాగా శృతి హాసన్  స్వయంగా ఈ విషయంపై స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని శృతి వీడియో పోస్ట్ చేసింది.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM