"గాడ్ ఫాదర్" ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ బ్లండర్ మిస్టేక్ ను గమనించారా...!!

by సూర్య | Tue, Jul 05, 2022, 07:04 PM

మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం "లూసిఫర్". ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. "గాడ్ ఫాదర్" పేరుతో ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. తెలుగులో ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు.
నిన్న ఈ మూవీకి సంబంధించి మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఐతే, ఆ వీడియోలో ఒక చోట చిరంజీవి స్పెల్లింగ్ ను తప్పుగా రాశారు. "CHIRANJEEVI" కి బదులు "CHIRANJEEEVI" అని రాశారు. ఒక 'E' ఎక్స్ట్రా గా రాయడమనేది ఏమైనా ప్రొమోషనల్ స్టంటా లేక చిరు న్యూమరాలజీ ప్రకారం తన నేమ్ స్పెల్లింగ్ ను మార్చుకున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. న్యూమరాలజీ ఐతే, వీడియోలో ఎక్కడైనా పేరు ఒకేలా ఉండాలి కానీ, ఒక్కోచోట ఒక్కోలా ఎందుకుందని, ఇది కేవలం మేకర్స్ యొక్క బ్లండర్ మిస్టేక్ అని కొంతమంది అభిమానులు గాడ్ ఫాదర్ మేకర్స్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి, ఈ విషయంపై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం విశేషం.
ఇందులో నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక కీలకపాత్రను పోషించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM