ఓటిటిలో "మేజర్" కు విశేష స్పందన.. ఏకంగా టాప్ 1, 2 పొజిషన్స్ లో 

by సూర్య | Tue, Jul 05, 2022, 12:08 PM

దేశవ్యాప్తంగా, చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్న సినిమా "మేజర్". శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో, 2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా మేజర్ సినిమా తెరకెక్కింది. లీడ్ రోల్ లో శేష్ నటిస్తూ, సినిమా కు రచయితగా కూడా పనిచేసాడు. ఈ సినిమా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబడుతోంది.
జూన్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజులకు అంటే జూలై 3వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో డిజిటల్ స్ట్రీమింగ్ రెడీ అవుతుంది. రెండ్రోజులలోనే నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ మూవీస్ లో మేజర్ సినిమా మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. మేజర్ హిందీ వెర్షన్ మొదటి స్థానంలో ఉండగా, తెలుగు వెర్షన్ రెండవ స్థానంలో ఉంది. ఈమేరకు అడవిశేష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. మేజర్ సినిమాకు థియేటర్లలోనే కాక ఓటిటిలో కూడా విశేష స్పందన రావడం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM