RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు

by సూర్య | Tue, Jul 05, 2022, 11:29 AM

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజమౌళి బాహుబలి తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం "RRR". కేవలం మనదేశంలోనే కాక దేశవిదేశాల్లో కూడా RRR ట్రెమండస్ హిట్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సినీ క్రిటిక్స్ సైతం RRR ను ఒక రేంజులో మెచ్చుకున్నారు. ఇందుకు భిన్నంగా, ఒక భారతీయుడు అది కూడా సినీ పర్సనాలిటీ అయ్యుండి సౌండ్ మిక్సర్ రసూల్ పూకుట్టి RRR ను ఒక గే లవ్ స్టోరీ గా అభివర్ణించడం పట్ల RRR అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పుష్ప సినిమాకు రసూల్ పూకుట్టి సౌండ్ మిక్సర్ గా పని చేసారు, ఇందుకుగాను రసూల్ పవర్ బ్రాండ్స్ బెస్ట్ సౌండ్ మిక్సర్ గా అవార్డు కూడా అందుకున్నారు. సహజంగానే పుష్ప సీక్వెల్ కు కూడా రసూల్ సౌండ్ మిక్సర్ గా పని చెయ్యనున్నారు. రసూల్ పై ఆర్ ఆర్ ఆర్ కాంట్రవర్సీ చిలికి చిలికి గాలివాన అవుతుండడంతో పుష్ప సీక్వెల్ నుండి అతన్ని తప్పించాలని పలువురు నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్టులకు పుష్ప మేకర్స్ ను ట్యాగ్ చేస్తున్నారు. మరి దీనిపై పుష్ప మేకర్స్ కానీ, రసూల్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.    

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM