బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..!

by సూర్య | Fri, Jul 01, 2022, 10:21 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రేజీ హీరోయిన్ రష్మిక మండన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరాదిన పుష్ప సినిమా ఒక సంచలనం. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్, ఆయన మ్యానరిజం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ టేకింగ్ ఈ సినిమాని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. వీటికే ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
వెండితెరపైనే కాక పుష్ప బుల్లితెరపై కూడా అద్భుతాలు చేస్తున్నాడు. టెలివిజన్ లో మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 22.5 టీఆర్పీని తదుపరి 12.8, 9.6 టీఆర్పీ రేటింగులతో దూసుకుపోతుంది. ఏదైనా కొత్త సినిమా తొలిసారి టెలికాస్ట్ అయితే, టిఆర్పి రేటింగ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ పుష్ప సినిమాకు రెండోసారి, మూడోసారి కూడా అదే తరహాలో టిఆర్పి రావడం నిజంగా గ్రేట్.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM