కేజీఎఫ్ 3 పై ప్రశాంత్ నీల్ లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Thu, Jun 23, 2022, 06:27 PM

ఎప్పుడైతే కేజీఎఫ్ విడుదలై దేశవ్యాప్త సంచలనం సృష్టించిందో, అప్పటినుండి ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీకి దేశం మొత్తం మీద పెద్దఎత్తున అభిమానులున్నారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మించింది.
ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ... కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొస్తున్న ఆదరణతో, తప్పకుండా ఈ ఫ్రాంచైజీని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రేక్షకులకు కేజీఎఫ్ కథాకథనాలు, రాఖీభాయ్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవ్వడమే ఇందుకు కారణం. కేజీఎఫ్ 3 స్టోరీ లైన్ సిద్ధంగా ఉంది. నిజానికి కేజీఎఫ్ 2 మూవీకి ముందునుండే కేజీఎఫ్ 3 చెయ్యాలనే ఆలోచన ఉంది... అని చెప్పారు. ప్రస్తుతానికి వరస కమిట్మెంట్లతో ప్రశాంత్ తీరికలేకుండా గడుపుతున్నారు. దీంతో కేజీఎఫ్ 3 గురించి ఆలోచించే టైం కూడా తన వద్ద లేదని, భవిష్యత్తులో కేజీఎఫ్ 3 పట్టాలెక్కుతుందని, కానీ ఎప్పుడన్నది తనకు కూడా తెలియదని చెప్పారు. ప్రశాంత్ కన్ఫర్మేషన్ తో కేజీఎఫ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM