పూజా కార్యక్రమంతో ప్రారంభమైన చైతూ కొత్త సినిమా

by సూర్య | Thu, Jun 23, 2022, 04:52 PM

మానాడు, మన్మధ లీలై సినిమాల వరస సక్సెస్ జోష్ తో, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన తదుపరి సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తో ఉంటుందని ఇటీవలే ఎనౌన్స్ చేసాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో చైతు తమిళ సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ మూవీలో చైతూకు జోడిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటించబోతుంది. అలానే, ఈ సినిమాకు కోలీవుడ్ సంగీత ద్వయం, తండ్రీకొడుకులు, ఇళయరాజా - యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చెయ్యబోతున్నారు. ఈ మూవీలో చైతూకు వ్యతిరేక పాత్రలో కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ నటిస్తారని తెలుస్తుంది.
ఈ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భారతీరాజా, శివకార్తికేయన్, బోయపాటి శీను, రానా దగ్గుబాటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తమిళంలో ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి భారతీరాజా క్లాప్ కొట్టగా, శివకార్తికేయన్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తెలుగులో బోయపాటి శీను క్లాప్ కొట్టగా, రానా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

Latest News
 
ప్రముఖ నటుడు కిషోర్ దాస్ కన్నుమూత Sun, Jul 03, 2022, 10:53 PM
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM