ఆ దర్శకుడితో సూపర్ స్టార్ హ్యాట్రిక్ సినిమా?

by సూర్య | Thu, Jun 23, 2022, 04:36 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో వచ్చిన "కబాలి" సినిమా ఎంత డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, విడుదలకు ముందు ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పా రంజిత్ పై ఉన్న నమ్మకంతో సూపర్ స్టార్ మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే "కాలా". ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. రజిని అభిమానులు తనపై ఉంచిన నమ్మకాన్ని రంజిత్ కొంచెమైనా నిలబెట్టుకోగలిగాడు. కొత్త దర్శకుడైనా రజిని రెండుసార్లు రంజిత్ కు అవకాశం ఇవ్వడం...అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజాగా రంజిత్ తో రజిని మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. రజిని ప్రస్తుతం 169వ సినిమా "జైలర్"ను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నారు. 170వ సినిమాను రంజిత్ డైరెక్షన్లో చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, సూపర్ స్టార్ ను మూడుసార్లు డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ గా రంజిత్ రికార్డ్ సృష్టించినట్టే.

Latest News
 
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM
విజయ్ పోస్టర్‌పై సమంత కామెంట్ Sun, Jul 03, 2022, 12:11 PM