పుష్ప2 లో సరికొత్త మ్యానరిజం కోసం బన్నీ అష్టకష్టాలు !

by సూర్య | Thu, Jun 23, 2022, 04:21 PM

సుకుమార్ - అల్లుఅర్జున్ కాంబోలో ఇటీవల వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని పాటలు, డాన్స్ స్టెప్పులు ముఖ్యంగా బన్నీ మ్యానరిజమ్స్ ఇంటెర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందాయి. చాలామంది సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు "తగ్గేదేలే" మ్యానరిజం తో కొన్ని వందల రీల్స్ చేసారు. ఇప్పటికీ ఈ రీల్స్ మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. ఇంతటి ప్రాముఖ్యం పొందిన మ్యానరిజమ్స్ ను తిరిగి సీక్వెల్ లో ఉపయోగించటం కన్నా ఇదే తరహాలో సరికొత్త మ్యానరిజమ్స్ ను ఉపయోగిస్తే బావుంటుందనేది బన్నీ ఆలోచన అంట. అందుకోసం, బన్నీ తన సన్నిహితులను, టీంను చిత్తూరు, తమిళనాడు పరిసర ప్రాంతాలకు పంపించాడట. అక్కడ జనాలను క్షుణ్ణంగా పరిశీలించి పుష్ప 2 కు సరిపోయే పర్ఫెక్ట్ మ్యానరిజం తో తిరిగి రమ్మని ఆర్డర్ వేసాడట. సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉంటే, బన్నీ తన లుక్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. ఈ నేపథ్యంలో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకాస్త సమయం పట్టేటట్లుంది.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM