నాగ చైతన్య తదుపరి చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:52 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన గ్లామర్ బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేయనుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ తెలుగు-తమిళ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సినిమా కి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.

Latest News
 
అదిరిపోయే స్టిల్స్ రీతూ వర్మ ..ఫొటోస్ Tue, Jul 05, 2022, 12:51 PM
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM