విశ్వక్ సేన్ తదుపరి సినిమా లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయిన పవన్ కళ్యాణ్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:30 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో దర్శకుడిగా తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌ సరసన జోడిగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించనుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజాగా ఈరోజు ఈ సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. విశ్వక్ సేన్, అర్జున్ తదితరులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లాంఛింగ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తొలి షాట్‌కి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్‌రాజ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు అర్జున్‌కి మంచు విష్ణు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రంలో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ తన హోమ్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM