చార్మినార్‌ను సందర్శించిన "7 డేస్ అండ్ 6 నైట్స్" టీమ్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:21 PM

తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రేమికులకు ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌లో భారీ చిత్రాలను నిర్మించాడు. తాజాగా ఇప్పుడు, ఈ పెద్ద డైరెక్టర్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు. "7 డేస్ అండ్ 6 నైట్స్" అనే కొత్త సినిమాకి దర్శకుడిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. సుమంత్ అశ్విన్ మరియు మెహర్ చావల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జూన్ 24, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ చార్మినార్‌ని సందర్శించి తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లు సమాచారం. మూవీ టీమ్ అందరూ తమ సినిమాని థియేటర్లలోకి వచ్చి చూడాలని సినీ ప్రేమికులనూ అభ్యర్థించారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM