మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లను కలిపిన యంగ్ హీరో!

by సూర్య | Thu, Jun 23, 2022, 02:21 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ "మా" 2021 ఎన్నికలలో ప్రెసిడెంట్ పదవికి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. తుదకు, మంచు విష్ణు 'మా' ప్రెసిడెంట్ గా ఎన్నికై చిత్రపరిశ్రమ బాగోగులను చూసుకుంటున్నారు. అప్పటి నుండి వీరిద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయని, ఒకరంటే ఒకరికి పడట్లేదని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోతో ఇవన్నీ ఉత్త పుకార్లే అని తేలిపోయింది. యంగ్ హీరో విశ్వక్ పుణ్యమా అని వీరిద్దరిపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. విశ్వక్ కొత్త సినిమా ప్రారంభ కార్యక్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సరదాగా ముచ్చట్లు కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
సీనియర్ హీరో అర్జున్ డైరెక్షన్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే ఎక్కడ. ఈ మూవీ పూజా కార్యక్రమంతో ఈరోజే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవగా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ Thu, Jun 30, 2022, 11:10 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'పక్క కమర్షియల్' మూవీ Thu, Jun 30, 2022, 11:02 PM
'కేజీఎఫ్' సినిమా నటుడికి కారు ప్రమాదం Thu, Jun 30, 2022, 10:04 PM