రెంటల్ నుండి సాధారణ స్ట్రీమింగ్ కొచ్చిన 'సర్కారువారిపాట'

by సూర్య | Thu, Jun 23, 2022, 02:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి విడుదలైన కొత్త చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ మాస్ యాక్టింగ్ కు, డైలాగ్స్ కు, స్టైలిష్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ కు జనాలు నీరాజనాలు పలికారు. మే 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతూ ఐదు రోజులలోనే  రూ. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటించింది.
ఇటీవలే మ మ మ మాస్ సెలెబ్రేషన్స్ పేరిట SVP సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్మాతలు ఘనంగా నిర్వహించారు. నిన్నటి వరకు రెంటల్ బేసిస్ మీద అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కారువారిపాట జూన్ 23 నుంచి అంటే ఈ రోజు నుండి సాధారణ స్ట్రీమింగ్ తో సబ్ స్క్రైబర్లకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. మాస్ అండ్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది.

Latest News
 
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM
కొత్త సినిమాను ప్రకటించిన సుమంత్ Tue, Jul 05, 2022, 12:20 PM