చార్మినార్ వద్ద విభిన్నంగా ప్రచారం చేస్తున్న 7డేస్ 6నైట్స్ టీం

by సూర్య | Thu, Jun 23, 2022, 02:10 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారి చేస్తున్న రెండవ చిత్రం "7డేస్ 6నైట్స్". ఇందులో ఎమ్మెస్ తనయుడు సుమంత్ అశ్విన్, కొత్త నటీనటులు మెహర్ చాహల్, రోహన్, కృత్తికా శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం డర్టీ హరి సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, మెయిన్ క్యాస్ట్ హైదరాబాద్ లోని చార్మినార్ వద్దకు చేరి విభిన్నంగా ప్రమోషన్స్ చేశారు. చార్మినార్ వద్ద దొరికే చిరుతిళ్లను ను రుచి చూసి, కొంచెం సేపు షాపింగ్ చేసారు. రేపు రీలిజ్ అవుతున్న తమ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. చార్మినార్ ను చూస్తే తనకు వెంటనే "ఒక్కడు" మూవీ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని సుమంత్ చెప్పారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను సుమంత్ తండ్రి ఎమ్మెస్ రాజు నిర్మించారు.

Latest News
 
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM