మాట తప్పిన రానా... మరో ప్రయోగానికి ప్లాన్ !

by సూర్య | Thu, Jun 23, 2022, 02:02 PM

టాలీవుడ్ లో విభిన్న సినిమాలకు, విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఇకైక స్టార్ హీరో రానా దగ్గుబాటి. ఇటీవలే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రానా ఇకపై ప్రయోగాల జోలికి పోనని, అభిమానులు కోరుకునే మాస్ యాక్షన్ సినిమాలనే చేస్తానని చెప్పి మాటిచ్చారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం, అభిమానులకిచ్చిన మాటను రానా బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. మరోసారి ప్రయోగానికి తెరతీసినట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ ఎత్తున రూపొందుతున్న "జవాన్" చిత్రంలో రానా ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నాడని హిందీ మీడియా కోడై కూస్తుంది. జవాన్ సినిమా పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగబోతుందని గతంలో రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ ను బట్టి తెలుస్తుంది. అంటే, ఈ సినిమాలో షారుఖ్ ను ఢీకొట్టే బలమైన ప్రతినాయకుడు ఉండాలి. అందుకు రానా ఒక్కడే చాయిస్. దీంతో జవాన్ టీం షారుఖ్ ను ఎదుర్కొనే పవర్ఫుల్ రోల్ లో రానాను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఐతే, ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Latest News
 
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM