చైతూ మూవీ లో మరోసారి కృతిశెట్టి... మ్యూజిక్ కంపోజర్స్ గా తండ్రి కొడుకులు

by సూర్య | Thu, Jun 23, 2022, 11:18 AM

మానాడు, మన్మధ లీలై సినిమాల వరస సక్సెస్ జోష్ తో, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన తదుపరి సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తో ఉంటుందని ఇటీవలే ఎనౌన్స్ చేసాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో చైతు తమిళ సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన రెండు మేజర్ విషయాలను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే ప్రకటించారు.
అవేంటంటే, ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ మూవీలో చైతూకు జోడిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటించబోతుంది. అలానే, ఈ సినిమాకు కోలీవుడ్ సంగీత ద్వయం, తండ్రీకొడుకులు, ఇళయరాజా - యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చెయ్యబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేసారు.
ఈ మూవీలో చైతూకు వ్యతిరేక పాత్రలో కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ నటిస్తారని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతుందట. 

Latest News
 
ప్రభాస్ - మారుతి సినిమాకు బ్రేక్ వేస్తున్న ప్రముఖ నిర్మాత ...కారణం అదేనంట! Fri, Jul 01, 2022, 11:17 AM
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM