చిరు, బాలయ్య ఒకే వేదికపై... ఎప్పుడు? ఎక్కడ?

by సూర్య | Thu, Jun 23, 2022, 10:27 AM

టాలీవుడ్ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బలమైన పిల్లర్స్ లాంటివారు. వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని కోరుకోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. చిరు, బాలయ్యల సుదీర్ఘ సినీ కెరీర్ లో ఒక్కసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. బయట కూడా వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువే. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల కోరిక మేరకు తెలుగు ఓటిటి ఆహా సంస్థ మొదటిసారి ఈ పని చెయ్యబోతుంది. మెగాస్టార్ చిరంజీవిని, నటసింహం బాలకృష్ణను ఒకే స్క్రీన్ పై, ఒకే స్టేజ్ పై తీసుకొచ్చే అమోఘమైన ప్రయత్నం చేస్తుంది.
ఆహా ఓటిటిలో గతంలో స్ట్రీమింగ్ ఐన "అన్ స్టాపబుల్" టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. బాలయ్య సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, పంచ్ లు వెయ్యడం ... ఇవన్నీ కూడా ఈ టాక్ షోను సూపర్ సక్సెస్ చేసాయి. ముఖ్యంగా చాలామందికి చాన్నాళ్లుగా బాలయ్యపై ఉన్న నెగిటివిటి కూడా ఈ షోతో పరారైపోయింది. దీంతో ఈ షో కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు వేకళ్ళతో ఎదుచూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన సెకండ్ సీజన్ కు సంబంధించి బిగ్ ఎనౌన్మెంట్ రాబోతుందని ఇటీవలే బాలయ్య ప్రకటించారు. ఇదిలావుండగా, సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు మెగాస్టార్ రాబోతున్నారని టాక్ నడుస్తుంది. ఆహా అల్లు అరవింద్ సొంత సంస్థ కావడంతో మెగాస్టార్ ఈ షోలో తప్పక హాజరవుతారని మెగా, నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM