పక్కా కమర్షియల్ BTS ఫొటోస్ రిలీజ్

by సూర్య | Wed, Jun 22, 2022, 07:21 PM

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న కొత్త చిత్రం పక్కా కమర్షియల్. వినోదచిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయికగా నటించింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 1వ తేదీన విడుదలవడానికి రెడీ గా ఉంది. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో తగిన బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి మేకర్స్ సోషల్ మీడియాలో విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
టెన్ డేస్ టు గో, నైన్ డేస్ టు గో అంటూ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ పోస్టర్లను మేకర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. విడుదలకు ఇంకా తొమ్మిది రోజుల సమయమే ఉండడంతో నైన్ డేస్ టు గో పేరుతో మూవీ BTS ఫోటోలను ట్విట్టర్ లో విడుదల చేసారు. అందాల రాశి షూటింగ్ సమయంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఏదో విషయం గురించి డిస్కస్ చేస్తున్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Latest News
 
అదిరిపోయే స్టిల్స్ రీతూ వర్మ ..ఫొటోస్ Tue, Jul 05, 2022, 12:51 PM
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM