777చార్లీ చిత్రానికి సూపర్ స్టార్ ప్రశంసలు!

by సూర్య | Wed, Jun 22, 2022, 04:46 PM

"అతడే శ్రీమన్నారాయణ" సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి నటించిన మరో విభిన్నమైన చిత్రం 777చార్లీ. ఈ సినిమా పాన్ ఇండియా రేంజులో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో జూన్ 10వ తేదీన విడుదలైంది. కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు.
ప్రేక్షకుల నుండి ముఖ్యంగా పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకునే వారినుండి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ మూవీ కథ మొత్తం ఒక కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుంది. ఆ కుక్కపిల్లకు, రక్షిత్ కు మధ్య ఏర్పడిన బంధాన్ని ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించినట్టు తెలుస్తుంది.
తాజాగా ఈ మూవీ ని రూపొందించిన రక్షిత్ శెట్టిని అభినందిస్తూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనకు కాల్ చేసారట. ఈ విషయాన్ని రక్షిత్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. 777చార్లీ సినిమా చూసిన వెంటనే రజినీ రక్షిత్ కు ఫోన్ చేసి, శుభాకాంక్షలను తెలియచేశారట. అద్భుతమైన మేకింగ్ క్వాలిటీతో సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఎంతో హృద్యంగా ఆవిష్కరించారని తెగ పొగిడేశారట. ముఖ్యంగా రజినీకి క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగాలు, స్పిరిచ్యుల్ ధోరణిలో సినిమాను ముగించడం చాలా బాగా నచ్చిందట.

Latest News
 
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM
డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ? Tue, Jul 05, 2022, 10:52 AM
"హ్యాపీ బర్త్ డే" డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు Tue, Jul 05, 2022, 10:37 AM