ఆ మెగాహీరోను అనుకరిస్తున్న స్టైలిష్ స్టార్?

by సూర్య | Wed, Jun 22, 2022, 04:43 PM

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ స్టార్డం వేరే లెవెల్ కి వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమాగా రూపొందిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో పుష్ప 2 సీక్వెల్ పనులను ఆఘమేఘాల మీద పూర్తి చెయ్యాలని సుకుమార్ కు ఆర్డర్ వేసాడట. బాహుబలి మొదటి పార్టుకు రెండింతలన్నట్టు ఉండే బాహుబలి 2 లాగా పుష్ప 2 సీక్వెల్ ఉండాలని, ఆ లెవెల్ లో హిట్ కొట్టాలని మాస్టర్ ప్లాన్ వేసాడు బన్నీ. సో, స్క్రిప్ట్ ను మరింత పక్కాగా తయారు చేసేందుకు సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీంతో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లాలంటే మినిమమ్ మూడు నెలల సమయం పడుతుంది. ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం ఏడాది పైనే పడుతుంది. అంటే, పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఎట్లాలేదన్న ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం పూర్తిగా వేచి ఉండాలి.
ఈ క్రమంలో బన్నీ మరొక మాస్టర్ ప్లాన్ వేసాడట. ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూనే చెర్రీ ఆచార్య షూటింగ్ ఎలా చేసాడో, అలానే పుష్ప 2 చేస్తూనే మరో చిన్న సినిమా చెయ్యాలని బన్నీ ఆలోచిస్తున్నాడట. మంచి పవర్ఫుల్ కథతో, తక్కువ బడ్జెట్ లో ఒక చిన్న సినిమా స్టోరీ కోసం ఇప్పటికే బన్నీ మేనేజర్లు దర్శకుల కోసం గాలిస్తున్నారట. బన్నీ ఊఁ అనాలే కానీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దర్శకులందరూ క్యూ కడతారు. అన్ని కుదిరితే, ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Latest News
 
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM