డార్లింగ్ సపోర్ట్ తో "పక్కా కమర్షియల్" హిట్ అవ్వడం ఖాయం!

by సూర్య | Wed, Jun 22, 2022, 02:54 PM

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న కొత్త చిత్రం పక్కా కమర్షియల్. వినోదచిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయికగా నటించింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 1వ తేదీన విడుదలవడానికి రెడీ గా ఉంది. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో తగిన బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి డార్లింగ్ ఫ్యాన్స్ మద్దతు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్గా నటించినప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఏర్పడింది. దీంతో గోపీచంద్ కు ప్రభాస్ అభిమానులు కూడా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. కానీ పక్కా కమర్షియల్ కు మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందుకు ప్రభాస్-గోపీచంద్ ల ఫ్రెండ్షిప్ ఒక కారణమైతే, మారుతి మరొక కారణం. ఎందుకంటే, ప్రభాస్ మారుతి తో ఒక సినిమా చెయ్యనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ... తాను ప్రభాస్ కి గొప్ప అభిమానినని, ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి ఎటువంటి అంశాలను ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ తోనే సినిమా తీస్తానని ప్రామిస్ కూడా చేసారు. పక్కా కమర్షియల్ హిట్ ఐతే, మారుతి ప్రభాస్ తో చెయ్యనున్న సినిమాకు ప్రేక్షకుల్లో తగిన బజ్ ఉంటుంది. అలానే, ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ సంస్థ అధినేతలు నిర్మించడం కూడా ఒక కారణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాను కమర్షియల్ హిట్ చేసేందుకు తమ వంతు కృషి చెయ్యటానికి డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారట.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM