లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా

by సూర్య | Wed, Jun 22, 2022, 02:47 PM

"ఉప్పెన" సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తాజగా ఇప్పుడు తన 4వ ప్రాజెక్ట్ ని ఇటీవలే నూతన దర్శకుడు శ్రీకాంత్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి టెంపరరీగా 'PVT04' అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా ఈరోజు ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాల తోగ్రాండ్‌గా లాంచ్ చేశారు. మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియో గ్లింప్సె కూడా విడుదల చేసారు. ఈ వీడియోలో మెగా హీరో పూర్తి మాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై సూర్యదేవర నాగ వంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM