విజయ్ బర్త్ డే ట్రీట్...'వారసుడు' సెకండ్ లుక్ ఔట్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:44 PM

టాలీవుడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు.
ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో తలపతి 66 మూవీ టైటిల్ పోస్టర్ ను నిన్ననే మేకర్స్ రివీల్ చేసారు. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారమే తమిళంలో ఈ సినిమాకు "వారసి", తెలుగులో "వారసుడు" అనే టైటిల్స్ ను ఖరారు చెయ్యడం జరిగింది. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ సూటు బూటు ధరించి, మంచి క్లాస్ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా ఉంటే, తాజాగా రిలీజ్ చేసిన ఈ సెకండ్ పోస్టర్ లో క్యాజువల్ వేర్ లో చిన్న పిల్లలతో కలిసి ఎంటర్టైన్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి వారసుడు హంగామా చెయ్యనున్నాడు.

Latest News
 
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM
డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ? Tue, Jul 05, 2022, 10:52 AM