లేటైనా లేటెస్టుగా...నాగచైతన్య "థాంక్యూ" టీజర్

by సూర్య | Wed, May 25, 2022, 09:03 PM

అక్కినేని అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న చిత్రం 'థాంక్యూ'. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదలకావల్సింది. కరోనా మరియు ఇతర కారణాల వల్ల ఈ సినిమాకు లాంగ్ బ్రేక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగచైతన్య నటన గురించి. జీవితంలోని వివిధ దశల్లో నాగచైతన్య ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. చైతు ఎంతో పరిణితి తో నటించి ఆ పాత్రల వేరియేషన్ ను చూపిస్తూ నటుడిగా ఒక మెట్టు పైకెక్కాడనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు బలాన్నిచ్చే విధంగా ఉంది. ఇక టీజర్ ప్రకారం, జీవితంలో పై స్థాయికి రావాలనుకున్న చైతు ఎన్నింటినో త్యాగం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో చైతు స్వార్ధపూరిత మనిషిగా నటించబోతున్నాడు. 


"మనం" సినిమా తర్వాత దర్శకుడు విక్రమ్ కే. కుమార్, నాగచైతన్యతో చేస్తున్న రెండో సినిమా థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్, అవికా గోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 8వ తారీఖున ఈ సినిమా విడుదలవబోతుంది.


 

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM