ఆ యంగ్ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా లేనట్టేనా?

by సూర్య | Wed, May 25, 2022, 04:37 PM

వెంకీ కుడుముల... 2018లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నితిన్ తో 2010లో భీష్మ సినిమాని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనందుకున్నాయి. దీంతో వెంకీ కుడుముల పేరు ఇండస్ట్రీ మొత్తం మారు మోగిపోయింది. ఈ క్రేజ్ తో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక స్టోరీ లైన్ ని చెప్పి ఆయనతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు వెంకీ. ఈ సినిమాకు DVV దానయ్య  నిర్మాత. 


అనూహ్యంగా వెంకీ కుడుములతో చిరు ప్రాజెక్ట్ ఆగిపోయిందని చిత్రసీమలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వెంకీ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చినా, పూర్తి స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం సంతృప్తిగా లేరని చిత్రవర్గ సమాచారం. కధకు తగిన మార్పులు చేర్పులు చేసి రెండుసార్లు చిరును కలిసినా వెంకీ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఎందుకంటే, ఈ సినిమాను చిరు వదులుకున్నట్టు టాక్. అంతేకాక, ఇటీవల కొరటాల డైరెక్షన్లో చిరు నటించిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు తదుపరి సినిమాల దర్శకులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ గాంధీ, మెహర్ రమేష్, బాబీ కనిపించారు కానీ వెంకీ కుడుముల మాత్రం కనిపించకపోవటంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. మరి ఫ్యూచర్ లోనైనా ఈ ప్రాజెక్ట్ పై దర్శకనిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Latest News
 
రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, పీటీ ఉష Wed, Jul 06, 2022, 10:05 PM
రామ్ 'ది వారియర్' మూవీ అప్డేట్ Wed, Jul 06, 2022, 09:21 PM
ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:15 PM
రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ Wed, Jul 06, 2022, 09:08 PM
‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:03 PM