మూవీ మొఘల్ బయోపిక్ పై స్పందించిన వెంకీమామ

by సూర్య | Wed, May 25, 2022, 04:35 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో దివంగత, లెజెండరీ ప్రొడ్యూసర్ డా. డి. రామానాయుడు ఒకరు. ఆయన వారసుడిగా సురేష్ బాబు నిర్మాణ రంగంలో కొనసాగుతుండగా, నట వారసుడిగా విక్టరీ వెంకటేష్ వెండితెరపై కొనసాగుతున్నారు. 


వెంకటేష్ నటించిన కొత్త చిత్రం ఎఫ్ 3. ఇందులో వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా మే 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ మేరకు గత కొద్దిరోజుల నుండి చిత్రబృందం మొత్తం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ, తండ్రి బయోపిక్ లో నటించే విషయమై తన స్పందనను తెలియచేసారు. మంచి స్క్రిప్ట్ తో వచ్చి, తనను మెప్పిస్తే మూవీ మొఘల్ రామానాయుడు బయోపిక్ లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. తండ్రి బయోపిక్ మాత్రమే కాక, తనకు స్వామి వివేకానంద బయోపిక్ లో కూడా నటించాలనుందని, అందుకోసం ఎప్పటినుండో తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని వెంకటేష్ తెలిపారు.

Latest News
 
రామ్ 'ది వారియర్' మూవీ అప్డేట్ Wed, Jul 06, 2022, 09:21 PM
ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:15 PM
రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ Wed, Jul 06, 2022, 09:08 PM
‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:03 PM
రానా తమ్ముడి చేతుల మీదుగా ... అనన్యా నాగళ్ళ కొత్త సినిమా ప్రారంభం Wed, Jul 06, 2022, 07:47 PM