సిల్వర్ స్క్రీన్ పై రచ్చ చేసిన ఆ సినిమా బుల్లితెరపై మౌనమేల?

by సూర్య | Sun, May 22, 2022, 12:20 PM

గతంలో ఒక సినిమాకొచ్చే కలెక్షన్ల వివరాలు ప్రేక్షకులకు అంతగా తెలిసేది కాదు. కానీ ఒక సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్నది అప్పట్లో ట్రెండ్ గా ఉండేది. పోను పోనూ, థియేటర్లలో సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్నదాని కన్నా సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చింది?, ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంత?, యూట్యూబులో ఎన్ని మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి?, ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్స్, థీమ్ పోస్టర్, లిరికల్ సాంగ్స్... ఇలా ప్రతిదీ లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే ట్రెండ్. అలానే ఒక సినిమాకు టెలివిజన్ స్ట్రీమింగ్ లో ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందన్నది కూడా హాట్ టాపిక్కే. దీనికి కూడా రికార్డులుగా లెక్కలు కడుతున్నారు. 


రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ పూర్తి చేసుకుని బుల్లితెరపై సందడి చెయ్యటానికి సిద్దపడింది. వెండితెరపై ఈ సినిమా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దీంతో ఈ సినిమా బుల్లితెరపై కూడా రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ రేటింగును సొంతం చేసుకుంటుందని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ఈ సినిమాకు కేవలం 9.06 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం అప్పటికే భీమ్లానాయక్ ఓటిటిలో అందుబాటులోకి రావటం. అయినా ఈ సినిమా అప్పటికే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న బంగార్రాజు సినిమా కన్నా తక్కువ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవటం విశేషం. నాగార్జున, నాగచైతన్య లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా కూడా జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం మార్చి 27న తొలి టెలివిజన్ ప్రీమియర్ అయింది. జీ తెలుగులో ప్రీమియర్ అయిన ఈ సినిమాకు 14 టీఆర్పీ రేటింగ్ తో అగ్రస్థానంలో ఉంది. నటసింహం బాలయ్య నటించిన అఖండ సినిమా 13.31 టీఆర్పీ తో బంగార్రాజు తర్వాతి స్థానంలో ఉంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM