త్వరలో మహేశ్ తో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం...మల్టీస్టార్ చిత్రమేనా

by సూర్య | Sat, May 21, 2022, 07:39 PM

సర్కార్ వారి పాట చిత్రంతో మరో విజయాన్ని అందుకొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు త్వరలో తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా, అందాల బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిన సంస్థ నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మహేశ్ - త్రివిక్రమ్ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా మరో హీరోగా నటించనున్నాడట.


సూపర్ స్టార్ సినిమాలో నేచురల్ స్టార్..త్రివిక్రమ్ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడా..? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మిడియాలో చక్కర్లు కోడుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు రెండేళ్ళ తర్వాత సర్కారు వారి పాట సినిమాతో వచ్చారు. వరుస విజయాలను అందుకుంటున్న మహేశ్ ఖాతాలో మరో హిట్ చేరింది. ముందునుంచి కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా ఫైనల్‌గా మాత్రం మాసివ్ హిట్ అందుకున్నారు. కీర్తి సురేశ్ గ్లామర్, పరశురామ్ మేకింగ్ మహేశ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ థమన్ మ్యూజిక్ సినిమాలోని వివిధ సన్నివేశాలు ఇలా ప్రతీది సర్కారు వారి పాట సక్సెస్‌కు కారణం అయ్యాయి.


ఇదిలావుంటే  ఇంకా నాని రోల్ ఎంటనేది తెలియనప్పటికీ ఈ న్యూస్ మాత్రం అటు మహేశ్ అభిమానుల్లో ఇటు నాని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరి మేకర్స్ నుంచి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. కాగా, ఈ మూవీ తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ సినిమాను చేయాల్సి ఉంది. ఇక నాని నటించిన అంటే సుందరానికి విడుదలకు సిద్దమవుతుండగా, దసరా చిత్రం సెట్స్‌పై ఉంది. ఈ మూవీ నాని ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. సాధారణంగా త్రివిక్రమ్ మూవీలో ఇద్దరు హీరోలు మనకు కనిపిస్తారు. ఒకరు అగ్ర కథానాయకుడైతే, మరొకరు అప్ కమింగ్ స్టార్. అదే సూత్రాన్ని మాటల మాంత్రికుడు మహేష్ 28వ చిత్రంలోనూ అప్లై చేయబోతున్నారనేది టాక్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM