మళ్ళీ కలిసిన ఎన్టీఆర్ - త్రివిక్రమ్

by సూర్య | Sat, May 21, 2022, 02:40 PM

చిత్రసీమలో విబేధాలు సహజం. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చాలని రూల్ లేదు. ఒకరి ఆలోచనలను మరొకరి విజులైజేషన్ లోకి తీసుకు వచ్చి, అతనిని మెప్పించిన వాడే సూపర్ డూపర్ హిట్లు కొడతాడు. ఆ వ్యక్తి దర్శకుడైనా, హీరో, నిర్మాత ఎవరైనా కావొచ్చు. అయితే, ఈ ముగ్గురి ఆలోచనలు, సృజనాత్మకత ఏకమైతేనే రిజల్ట్ బెస్ట్ గా ఉంటుంది. వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి పట్టాలెక్కని సినిమాలు టాలీవుడ్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అలాంటి విషయమే తారక్ - త్రివిక్రమ్ ల సినిమాకు కూడా జరిగింది. 


ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ తో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు నిన్న మోషన్ పోస్టర్ కూడా రిలీజయ్యింది. నిజానికి తారక్ తన 30 వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చెయ్యవలసి ఉంది. ఆ సినిమా చర్చలలో వీరిరువురికి క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక అప్పటినుండి వీరి మధ్య స్నేహ బంధం దెబ్బ తిన్నదని అంతా అనుకున్నారు. ఈ వార్తలకు చెక్ పెడుతూ, నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపేందుకు త్రివిక్రమ్ తారక్ ఇంటికి వెళ్లారు. పర్సనల్ గా కలిసి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారని తెలుస్తుంది. దీంతో వీరి కాంబోలో మరో సినిమా ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే, వీరిద్దరి కలయిక లో సినిమా రావటానికి చాలా సమయమే పడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే, త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఇక, ఎన్టీఆర్ ఏమో, కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలతో మరింత బిజీగా ఉన్నాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM