ఆది సాయికుమార్ బ్లాక్ మూవీ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Sat, May 21, 2022, 01:52 PM

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్. ఇందులో దర్శనా బానిక్ హీరోయిన్. జీబీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఆది యంగ్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. సిటీలో జరిగే మర్డర్లు, దొంగతనాలను ఆది ఎలా ఛేదించాడు అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఆద్యంతం ఎక్సయిటింగ్ గా సాగింది. టైం లూప్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. 


ఈ చిత్రంలో ఆమని, సూర్య, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, పృథ్విరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, శ్యామ్ కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ సతీష్ ముత్యాల, ఎడిటర్ అమర్ రెడ్డి. ఈ మూవీ విడుదల తేదీపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM