బిగ్‌బాస్ విజేతగా బింధు మాధవి?

by సూర్య | Sat, May 21, 2022, 11:53 AM

తెలుగులో బిగ్‌బాస్‌కు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. తొలి ఐదు సీజన్లలో ఇప్పటి వరకు అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. శివబాలాజీ, కౌశల్, రాహుల్, అభిజిత్, సన్నీలు వరుసగా ఐదు సీజన్‌లలో బిగ్‌బాస్ టైటిల్ అందుకున్నారు. అన్ని సీజన్లలో అమ్మాయిలు గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ విజేతలుగా నిలవలేకపోయారు. మూడో సీజన్‌లో శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా రాహుల్ సిప్లిగంజ్‌ను విజయం వరించింది. ఈ తరుణంలో 24 గంటల పాటు నిరంతర ప్రసారంతో సరికొత్తగా ఆరో సీజన్‌ను ఓటీటీలో ప్రారంభించారు.

ఇందులో గత బిగ్‌బాస్ సీజన్లలో పాల్గొన్న చాలా మందిని ఓటీటీ సీజన్‌లో పాల్గొన్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి విజేతగా అమ్మాయి నిలవనున్నట్లు ప్రచారం సాగుతోంది. బింధు మాధవిని టైటిల్ వరించిందని తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. ఇప్పటికే బింధుమాధవికి మద్దతుగా హ్యాష్‌టాగ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. దీంతో బిగ్ బాస్ విజేత ఆమేనని అంతా భావిస్తున్నారు. నాలుగో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ మరోసారి రెండో స్థానంలో నిలిచాడని తెలుస్తోంది. మూడో స్థానంలో మిత్ర ఉందని ప్రచారం సాగుతోంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM