"అశోకవనంలో అర్జునకళ్యాణం" సక్సెస్ తో.. ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చిన విశ్వక్ సేన్ !

by సూర్య | Sat, May 21, 2022, 11:35 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మే 6న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. ప్రేక్షకుల నుండి, అనలిస్టుల నుండి అద్భుతమైన రివ్యూలను సంపాదించుకున్న ఈ చిత్రంతో విశ్వక్ కు మరింత క్రేజ్ వచ్చింది. దీంతో యూటర్న్ తీసుకున్న విశ్వక్ తన నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్లకు చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. విశ్వక్ ఇచ్చిన కాస్ట్లీ ట్విస్ట్ తో ఆ ఒక ప్రొడ్యూసర్ కు కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించిందని టాక్. విభిన్నమైన కధాంశాలతో, ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విశ్వక్ AVAK సినిమాతో కెరీర్లో మరో మెట్టు పైకెక్కాడు . అప్పటివరకు రూ. 1 - రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ రేంజులో ఉండే విశ్వక్ ఒకేసారి 3కోట్లకు తన పారితోషికాన్ని పెంచాడు. దీంతో అంతకుముందే విశ్వక్ తో రూ. కోటి డీల్ కుదుర్చుకున్న నిర్మాత అయోమయంలో పడ్డాడట. విశ్వక్ పెంచిన పారితోషికానికి తను సరితూగలేనని, కొంతవరకైనా తగ్గించమని ఆ నిర్మాత వేడుకోగా విశ్వక్ ససేమిరా అన్నాడట. నువ్వు కాకపోతే, మరో నిర్మాతను సెలెక్ట్ చేసుకుంటానని బెదిరించాడట. దాంతో ఖంగారు పడిపోయిన ఆ నిర్మాత , చేసేదేమీ లేక విశ్వక్ పెంచిన రేటుకే తన పారితోషికాన్ని ఇస్తానని ఒప్పుకున్నాడట. విశ్వక్ అంటే ఏమనుకుంటున్నారు.... మాస్ కా దాస్ అంటే మజాక్ కాదు... ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తాడు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM