భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, May 20, 2022, 04:43 PM

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ కాంబోలో మరో సినిమా వస్తే బావుణ్ణని పవన్ ఫ్యాన్స్ కోరుకున్నారు. అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా పవన్ ను తెరపై చూపించి, వారి చేత విజిల్స్ కొట్టిస్తారు హరీష్. వీరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటూ ఉండాలి. ఇటీవల పవన్ పొలిటికల్ గా బిజీ అవడంతో హరీష్ సినిమాకు లాంగ్ బ్రేక్ వచ్చింది. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న హరిహారవీరమల్లు తో పవన్ ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల హరీష్ శంకర్ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే భవదీయుడిని పట్టాలెక్కించేస్తారు పవన్. అందులో నాయికగా పూజాహెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ వినబడుతుంది. అదేంటంటే, కెరీర్లో తొలిసారి పవన్ లెక్చరర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుందని టాక్.

Latest News
 
ఎన్టీఆర్ వీరాభిమాని మృతి Tue, Jul 05, 2022, 11:44 PM
'విక్రమ్ గౌడ్' మూవీ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్ Tue, Jul 05, 2022, 11:25 PM
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన శృతి హాసన్ Tue, Jul 05, 2022, 11:13 PM
కొత్త సినిమా ప్రకటించిన కళ్యాణ్ రామ్ Tue, Jul 05, 2022, 10:10 PM
రామ్ 'ది వారియర్' మూవీ కోసం వస్తున్న కోలీవుడ్ స్టార్స్ Tue, Jul 05, 2022, 09:28 PM