ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్

by సూర్య | Fri, May 20, 2022, 04:38 PM

కేజీఎఫ్ ఫ్రాంచైజీతో ఒక్కసారిగా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. కేజీఎఫ్ 1,2 చిత్రాలను ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్టుతో నిర్మించి అంతకంతకూ లాభాలను గడించింది. మొన్ననే లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో సినిమాను ఎనౌన్స్ చేసిన హోంబలే ఫిలిమ్స్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు తెర తీసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం 'ఉగ్రం' లో హీరోగా నటించిన శ్రీ మురళి తో హోంబలె నిర్మాణ సంస్థ భగీర అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. డాక్టర్ సూరి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం ఈ రోజు బెంగుళూరులో జరిగింది. ఈ మూవీకి సంబంధించి గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పోస్టర్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అవతారంలో శ్రీ మురళి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్ ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నారని శాండల్ వుడ్ టాక్. ఈ మూవీలో నటించే నటీనటుల విషయమై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. బెంగుళూరు, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ వచ్చే సంవత్సరం తొలి భాగంలో విడుదలవనుంది.

Latest News
 
ఎన్టీఆర్ వీరాభిమాని మృతి Tue, Jul 05, 2022, 11:44 PM
'విక్రమ్ గౌడ్' మూవీ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్ Tue, Jul 05, 2022, 11:25 PM
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన శృతి హాసన్ Tue, Jul 05, 2022, 11:13 PM
కొత్త సినిమా ప్రకటించిన కళ్యాణ్ రామ్ Tue, Jul 05, 2022, 10:10 PM
రామ్ 'ది వారియర్' మూవీ కోసం వస్తున్న కోలీవుడ్ స్టార్స్ Tue, Jul 05, 2022, 09:28 PM