మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

by సూర్య | Fri, May 20, 2022, 04:35 PM

కన్నడ నటి సంజనా గల్రానీ, అజీజ్ పాషా దంపతులకు మగబిడ్డ పుట్టాడు. దీంతో వారిద్దరూ సంతోషంలో మునిగిపోయారు. సంజనకు చికిత్స చేసిన డాక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలపడంతో విషయం వైరల్ అయింది. బిగ్ బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ డాక్టర్ అజీజ్ పాషాతో మే 2020లో రహస్యంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో వారి పెళ్లి జరిగింది. అజీజ్ పాషాతో తన వివాహం రహస్యమేమీ కాదని, అయితే దానిని బహిరంగపరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని సంజనా గల్రానీ గతంలో తెలిపారు. ఈ జంట 16 సంవత్సరాల వయస్సు నుండి ఒకరికొకరు తెలుసు.

ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిషతో కలిసి నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రానీ. సినిమాల్లోకి వచ్చాక, తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడేది. ఆ తర్వాత సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. కోలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కూడా కొన్ని వివాదాల్లో ఇరుక్కుంది. శాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్ బాషా అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆపై ఆమె కూడా ఇస్లాం స్వీకరించింది.

Latest News
 
ఎన్టీఆర్ వీరాభిమాని మృతి Tue, Jul 05, 2022, 11:44 PM
'విక్రమ్ గౌడ్' మూవీ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్ Tue, Jul 05, 2022, 11:25 PM
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన శృతి హాసన్ Tue, Jul 05, 2022, 11:13 PM
కొత్త సినిమా ప్రకటించిన కళ్యాణ్ రామ్ Tue, Jul 05, 2022, 10:10 PM
రామ్ 'ది వారియర్' మూవీ కోసం వస్తున్న కోలీవుడ్ స్టార్స్ Tue, Jul 05, 2022, 09:28 PM