ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

by సూర్య | Fri, May 20, 2022, 04:33 PM

సాఫ్ట్ వేర్ బ్లూస్ అనే చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు పలువురు కొత్త నటీనటులు పరిచయమవబోతున్నారు. ఉమా శంకర్ డైరెక్షన్లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ నిర్మించింది. సుభాష్ ఆనంద్ సంగీతమందించారు. వంశీకృష్ణ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు.  ఈ చిత్రంతో శ్రీరామ్ నిమ్మల అనే యువ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భావనా అనే కొత్తమ్మాయి హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ విడుదల చేసారు. సాఫ్ట్ వేర్ బ్లూస్ టైటిల్ కు తగ్గట్టుగానే, సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సంపాదించడంలో యువత ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటుందో, ఆ జాబ్ లో ఎంతటి ఒత్తిడి ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో జూన్ 24న ఈ చిత్రం విడుదల కానుంది.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM