బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా?

by సూర్య | Fri, May 20, 2022, 04:29 PM

ప్రేక్షకాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 నుండి బిగ్ సప్రైజ్ ను నిన్ననే దర్శకుడు కొరటాల శివ రివీల్ చేసారు. ఆచార్య డిజాస్టర్ తో అప్రతిష్టను మూట కట్టుకున్న కొరటాల ఎన్టీఆర్ 30తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టబోతున్నాడని ఈ మోషన్ పోస్టర్ తో అందరికి అర్ధమైంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే, గతంలో కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో విడుదలైన #AA 21 థీమ్ పోస్టర్ గుర్తుకొస్తుంది. సముద్రపు అలలు, తెప్ప, బ్లాక్ థీమ్... అచ్చు బన్నీ మూవీ పోస్టర్ లానే ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ఉండటంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 సినిమాతో బన్నీ ఈ సినిమాను వదులుకున్నట్టు తెలుస్తుంది. బన్నీ వదులుకున్న అదే కథకు  మరింత యాక్షన్ ఎలిమెంట్స్, హీరోయిజం ను జతచేసి ఎన్టీఆర్ 30గా కొరటాల మార్చాడని అంటున్నారు. అయితే ఇందులో తప్పేముంది? ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని మరొక హీరోతో చేసిన ఎంతోమంది డైరెక్టర్లు, సినిమాలు ఉన్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఆ కోవలోకే ఎన్టీఆర్ 30 కూడా వస్తుంది. అయితే, ఈ రెండు సినిమాల పోస్టర్లకు బాగా దగ్గరి పోలికలుండటంతో హాట్ డిబేట్లు జరుగుతున్నాయి.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM