ఎన్టీఆర్ 30 డైలాగుతో కొరటాల ఏం చెప్పాలనుకుంటున్నాడు?

by సూర్య | Fri, May 20, 2022, 04:25 PM

మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ ను రివీల్ చేసారు.  ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్న నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని ఈ మోషన్ పోస్టర్ తో కొరటాల మరింత పెంచేశారు. ప్రేక్షకుల నుండి కూడా ఈ మోషన్ పోస్టర్ పై మంచి రివ్యూలు వస్తున్నాయి. ఆచార్య డిజాస్టర్ కు ఎన్టీఆర్ 30తో కొరటాల తగిన సమాధానం చెప్పబోతున్నాడని అందరు అనుకుంటుండగా, ఎన్టీఆర్ 30డైలాగ్ పై కొంతమంది అభ్యంతరం తెలుపుతున్నారు. అప్పుడప్పుడు ధైర్యం కూడా ఎక్కువగా ఉండకూడదు అలా ఉన్నప్పుడు భయానికి అది రావాల్సిన సమయం గుర్తొస్తుంది... అని ఎన్టీఆర్ తో కొరటాల చెప్పించాడు. అంటే, ధైర్యం కన్నా భయానికి ఎక్కువ విలువను ఇచ్చాడు. ఇది ఎంతవరకు సబబు? అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ పురాణేతిహాసాల్లో భయానికన్నా ధైర్యం, నమ్మకమే చాలా గొప్పవి అని ఉంటుంది. ఈ అంశంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. మరి ధైర్యం కన్నా భయమే గొప్ప అని చెప్పాలనుకుంటున్న కొరటాల ఆంతర్యమేంటి? కొరటాల ఎంచుకున్న ఈ విభిన్నాంశం ప్రేక్షకులను ఎంతవరకు ఒప్పించగలుగుతుంది? చూద్దాం.

Latest News
 
పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో? Tue, Apr 16, 2024, 11:44 AM
'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Apr 15, 2024, 10:37 PM
'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 15, 2024, 07:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్ Mon, Apr 15, 2024, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 15, 2024, 07:13 PM