శివకార్తికేయన్- సాయిపల్లవి మూవీకి ఆసక్తికర టైటిల్

by సూర్య | Fri, May 20, 2022, 03:58 PM

హీరో శివకార్తికేయన్ లీడ్ రోల్ లో, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై విశ్వనటుడు కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. సోనీపిక్చర్స్ ఇండియా తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మావీరన్ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను లాక్ చేసినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రానుంది. కోలీవుడ్ బుల్లితెర నుండి వెండితెరకు ఎదిగి, అనతికాలంలోనే స్టార్ హీరోగా మారిన శివ కార్తికేయన్ తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తుంటాడు. రెమో, సీమరాజా, వరుణ్ డాక్టర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమాలంటే, తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. 


ప్రస్తుతం శివకార్తికేయన్ జాతిరత్నాలు ఫేమ్ కె. వి. అనుదీప్ డైరెక్షన్లో  ఒక ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషలలో తెరకెక్కుతుంది.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM