విక్రమ్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చెయ్యనున్న మెగా పవర్ స్టార్

by సూర్య | Fri, May 20, 2022, 03:19 PM

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన కొత్త చిత్రం విక్రమ్. ఇటీవల కమల్ నుండి వచ్చిన సినిమాలన్నిటిలోకి విక్రమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విలక్షణ నటులైన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరో సూర్య అతిధి పాత్రలో మెరవబోతున్నారు. నగరం, ఖైదీ సినిమాలతో కోలీవుడ్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేసిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. తమిళ్, హిందీ భాషల్లో ఈ మధ్యనే విడుదలైన విక్రమ్ ట్రైలర్ కు యూట్యూబులో రెస్పాన్స్ మాములుగా లేదు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా, గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. విక్రమ్ మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులను హీరో నితిన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు తెలుగులో కూడా భారీ హైప్స్ ను తీసుకొచ్చే ప్రయత్నాలను నితిన్ మొదలెట్టేసాడు. ఈ క్రమంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేత విక్రమ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు నితిన్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రామ్ చరణ్ విక్రమ్ మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ఈ చిత్రం విడుదలవబోతుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM