'సాలార్' కొత్త షెడ్యూల్ పై లేటెస్ట్ బజ్

by సూర్య | Fri, May 20, 2022, 02:51 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా 2023 ఏప్రిల్ లేదా జూన్‌లో విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 24 నుండి ప్రారంభమవుతుంది అని మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో 20 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ జరగనుంది అని సమాచారం. రవి బస్రూర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM