'విక్రమ్' తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్న మెగా పవర్ స్టార్

by సూర్య | Fri, May 20, 2022, 02:49 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'విక్రమ్' సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM