'SSMB28 ' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, May 20, 2022, 02:41 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నానిని సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ పాత్ర కోసం సుశాంత్‌ను సంప్రదిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. సుశాంత్ ఇప్పటికే త్రివిక్రమ్‌తో 'అల వైకుంఠపురంలో' సినిమా చేశాడు. మరి సుశాంత్ ఈ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చుడాలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM