శివకార్తికేయన్-కమల్ హాసన్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు

by సూర్య | Fri, May 20, 2022, 02:34 PM

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తన 21వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌ నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి 'మావీరన్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో స్టార్ యాక్టర్ ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించారు. ఇందులో శివకార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన గ్లామర్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM