శివకార్తికేయన్ పై కోలీవుడ్ సూపర్ స్టార్ ప్రశంసల వర్షం

by సూర్య | Thu, May 19, 2022, 09:25 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, విడుదలైన కొత్త సినిమాలను అన్నిటిని చూసి తనకు నచ్చిన మూవీ టీం కి ఫోన్ చేసి విష్ చేస్తారనే విషయం తెలిసిందే. తాజాగా డాన్ సినిమా చూసి రజినీకాంత్ శివకార్తికేయన్ కు ఫోన్ చేసి విషెస్ తెలిపారట. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ శిష్యుడు శిబి చక్రవర్తి డైరెక్టోరియల్ డిబట్ మూవీ ఇది. ఎమోషనల్,రొమాంటిక్, కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయన్, హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. మే 13న విడుదలైన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమాను చూసి రజినీకాంత్ శివకార్తికేయన్ కు ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నారట. సినిమా చాలా చాలా బాగుంది. నీ నటన అద్భుతంగా ఉంది. చివరి ముప్పై నిముషాలు నా కళ్ళు చెమ్మగిల్లాయి... అని రజినీ 'డాన్' పై ప్రశంసల వర్షం కురిపించారట. 


 

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM