పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి సంజనా గల్రాని

by సూర్య | Thu, May 19, 2022, 09:21 PM

సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల సంజనా సీమంతం ఫోటోలు, బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంజనా ను ట్రీట్ చేసిన డాక్టర్ శిల్పిరెడ్డి ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ పై సంజనా తో కలిసి దిగిన సెల్ఫీ ను పోస్ట్ చేసి ఇట్స్ ఏ బేబీ బాయ్ ... అంటూ కామెంట్ చేసింది. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2008లో నటించిన బుజ్జిగాడు చిత్రం తో సంజనా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. దండుపాళ్యం 2 లో సంజన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తన చిరకాల స్నేహితుడు డాక్టర్ అజిష్ పాషా ను 2020 మే లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంజనా ఆ విషయాన్ని 2021 జూలై లో డాక్టర్స్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ నిక్కీ గల్రాని, సంజనా ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. నిన్ననే నిక్కీ గల్రాని వివాహం హీరో ఆది పినిశెట్టితో ఘనంగా జరిగింది.

Latest News
 
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM
త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్' టీజర్ Wed, Apr 24, 2024, 05:06 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Wed, Apr 24, 2024, 05:04 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Apr 24, 2024, 04:38 PM
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM