అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో

by సూర్య | Thu, May 19, 2022, 04:51 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒక్కరు. ఈ హీరో ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న 'సమ్మతమే' సినిమాలో కనిపించనున్నారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 24, 2022న ఈ సినిమా థియేటర్లలో విదుదల కానుంది. తాజాగా ఇప్పుడు 'బావ తాకితే' అనే రెట్రో పాటను మే 21న ఉదయం 11.11 గంటలకు విడుదల చేయనున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం మరియు చాందిని చౌదరిల రొమాంటిక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. రొమాంటిక్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సాంగ్ ప్రోమో అందరినీ అలరించింది. సనాపతి భరద్వాజ్ పాత్రుడు కంపోస్ చేసిన ఈ పాటను మల్లికార్జున్, మాళవిక రొమాంటిక్‌గా పాడారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Latest News
 
నితిన్ "మాచర్ల నియోజకవర్గం" లేటెస్ట్ అప్డేట్ Wed, Jul 06, 2022, 03:50 PM
అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న కేతికా శర్మ Wed, Jul 06, 2022, 03:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న కిరణ్ అబ్బవరం "సమ్మతమే"? Wed, Jul 06, 2022, 03:39 PM
విష్ణుప్రియ బోల్డ్ ఫోజులు Wed, Jul 06, 2022, 03:30 PM
వైరల్: "వారసుడు" మరో "అజ్ఞాతవాసి" కాబోతుందా...? Wed, Jul 06, 2022, 03:07 PM